బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ భారీ వసూళ్లు అందుకున్న “కాంతారా”.!

లేటెస్ట్ గా భారీ హిట్ అయ్యినటువంటి చిత్రం కన్నడ సెన్సేషన్ “కాంతారా” కోసం తెలిసిందే. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోయిన్ గా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ ఓ డివోషనల్ హిట్ గా అయితే నిలిచింది.

ఇక ఈ చిత్రం వసూళ్ల పరంగా తెలుగు మరియు హిందీ మరియు కన్నడ భాషల్లో భారీ వసూళ్లు ఈ చిత్రం అందుకొని కొనసాగుతుండగా.  ఈ చిత్రం అయితే వసూళ్ల పరంగా మరో సెన్సేషనల్ మార్క్ ని అయితే అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతూ వస్తున్నారు.

ఈ మరి రీసెంట్ గానే ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ ని అందుకోగా డెఫినెట్ గా ఈ చిత్రం నెక్స్ట్ 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రపంచ వ్యాప్తంగా చేరుతుంది అని చెప్పారు. మరి కన్నడ నుంచి గ్లోబల్ గా ఈ చిత్రం మరో 300 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ చిత్రంగా ఈ కాంతారా ఇప్పుడు నిలిచింది.

మరి ఈ చిత్రం కేవలం 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 305 కోట్ల గ్రాస్ ని అందుకొని రికార్డు సృష్టించింది. మరి ఈ చిత్రం హిట్ తో కన్నడ ఇండస్ట్రీ మరోసారి ఇండియన్ సినిమా దగ్గర మెరిసింది అని చెప్పాలి.