బాక్సాఫీస్ రిపోర్ట్ : ఏపీ/తెలంగాణలో “సర్కారు వారి పాట” 2 డేస్ వసూళ్ల డీటైల్స్.!

Box Office Report Sarkaru Vaari Paata :

Box Office Report Sarkaru Vaari Paata : టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” మొన్న గురువారం వర్కింగ్ డే నాడు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా అయితే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం అయితే అధికారికంగా వసూళ్ల వివరాలు రెండు రోజులకి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా రెండో రోజు వసూళ్ళని ఏపీ మరియు తెలంగాణాకి సంబంధించి తెలుపుతున్నారు.

మరి వారి మాట ప్రకారం రెండో రోజు ప్రాంతాల వారీగా చూసినట్టు అయితే.. నైజాంలో : 5.2 కోట్లు, సీడెడ్ లో : 1.45 కోట్లు, వైజాగ్ – 1.65 కోట్లు, తూర్పు గోదావరి : 1.08 కోట్లు, పశ్చిమ : 0.45 కోట్లు, గుంటూరు : 0.51 కోట్లు, కృష్ణ : 0.89 కోట్లు అలాగే ఫైనల్ గా నెల్లూరులో : 0.41 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టింది దీనితో రెండో రోజు టోటల్ గా 11.6 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టిందట.

దీనితో రెండు రోజులకి గాను 48 కోట్ల షేర్ ని రాబట్టేసిందట. అలాగే యూఎస్ లో అయితే 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుందట. మొత్తానికి అయితే సర్కారు వారి పాట మంచి వసూళ్లనే అందుకుంటుంది. కానీ ఇంకా 60 కోట్ల షేర్ ని అయితే రాబట్టాల్సి ఉంది.