బాక్సాఫీస్ రిపోర్ట్ : “ఎఫ్ 3″కి మొదటి రోజు కలెక్షన్స్ ఎంతెంత వచ్చాయంటే.!

F3 Collections

ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి వెంకీ మామ మరియు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 3”. తమ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన ఎఫ్ 2 సెన్సేషనల్ బాక్సాఫీస్ హిట్ కాగా ఈ సినిమాని కూడా అంతే నమ్మకంగా ప్రొజెక్ట్ చేస్తూ గట్టి హైప్ ని తెచ్చే రిలీజ్ చేశారు.

అయితే ఆ అంచనాలను అందుకుని ఈ సినిమా ఫస్ట్ డే మంచి రెస్పాన్ ఆడియెన్స్ నుంచి అందుకున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లు అందుకుందో ట్రేడ్ వర్గాల వారు రివీల్ చేశారు. ఇక ప్రాంతాల ప్రకారం ఈ వసూళ్ల డీటెయిల్స్ చూసినట్టు అయితే..

నైజాం – 4.06 కోట్లు, సీడెడ్ – 1.26 కోట్లు, ఉత్తరాంధ్ర – 1.18 కోట్లు, గుంటూరు – 88 లక్షలు, నెల్లూరు – 62 లక్షలు, ఈస్ట్ గోదావరి – 76 లక్షలు, వెస్ట్ గోదావరి – 94 లక్షలు, కృష్ణ – 67 లక్షలు ఈ చిత్రం వసూలు చేసింది. అంటే ఈ చిత్రం ఫస్ట్ డే ఏపీ తెలంగాణాలో 10.37 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఈ సినిమా బిజినెస్ కి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. అలాగే యూఎస్ లో కూడా ఈ సినిమా ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కి గాను హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసిందట. మొత్తంగా ఐతే ఈ సినిమాకి మొదటి రోజే గట్టి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ రెండు రోజులు ఎలా వస్తాయో చూడాలి.