2020లో కూడా కుల రాజకీయాలు జరుగుతున్నాయంటే మన దేశం ఎంత దరిద్రమైన స్థితిలో ఉందొ అర్ధమవుతుంది. ప్రజలు కూడా అభివృద్ధి కోసం ఆలోచించకుండా కులాలు, మతాల పేరిట ఓట్లు వేస్తున్నారంటే ఎంత దరిద్రమైన మైండ్ సెట్ తో ఉన్నారో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రజలకు కుల గుల ఉంటే ప్రజలను నడిపించే, ప్రజల ముందుండే రాజకీయ నాయకులు వాటిని తొలగించడానికీ కృషి చేయాలి కానీ చాలామంది రాజకీయ నాయకులు కులాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కులం పేరిట రాజకీయాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ముందుంటారు. అయితే బొత్స చేస్తున్న కుల రాజకీయాల వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది.
అది కూడా ఉత్తరాంధ్రలోని కీలకమైన విజయనగరం జిల్లాలోనే కావడం గమనార్హం. విషయంలోకి వెళ్త. విజయనగరం జిల్లాలో ఆది నుంచి కూడా చక్రం తిప్పుతున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనతో ఇప్పటికీ జిల్లాలోని చాలా మంది టీడీపీ నాయకులు రాజకీయంగా కులం పరంగా కూడా లాలూచీ పడతారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
బొత్స సత్యనారాయణ చేస్తున్న కుల రాజకీయాలకు ప్రతీక ఏంటంటే 1990లో బొత్స ఎంపీగా పగడాల అరుణపై గెలవడానికి కూడా కుల రాజకీయాలే కారణమని రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు. విజయనగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బొత్స సత్యనారాయణతో లాలూచీ రాజకీయం చేస్తారనే టాక్. సొంత పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. నెల్లిమర్లలోనూ టీడీపీ నాయకుడు పతివాడ నారాయణ స్వామి, ఆయన కుమారుడు తమ్మినాయుడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు,, ప్రస్తుత ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడుకు మధ్య మంచి రిలేషన్ ఉందని.. వీరు పార్టీలతో సంబంధం లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటారని టీడీపీ వర్గాలే చర్చించుకుంటాయి. టీడీపీలో కేఏ అప్పలనాయుడు వంటి వారు మాత్రమే బలంగా ఉన్నారు. బొత్స సత్యనారాయణతో అప్పలనాయుడు లాంటి వాళ్లు మాత్రమే ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఉన్నారని… మిగిలిన వారిలో చాలా మంది బొత్సతో లాలూచీ రాజకీయం చేస్తున్నారని రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు. జిల్లాలో బొత్స సత్యనారాయణ చేస్తున్న కుల రాజకీయాలను చేస్తూ ఎంత పని చేశావయ్య అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు.