ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో అంతా వన్ సైడర్ ట్రేడింగే. ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంతా భూటకం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి బోండా ఉమ.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీపై మండిపడ్డారు. వైసీపీ నాయకుల సంగతి అందరికీ తెలుసు. వాళ్లు కోర్టు బోనులో చేతులు కట్టుకొని నిలబడేవాళ్లు.. ఇప్పుడు జడ్జీలకే చట్టాల గురించి చెబుతున్నారు. అమరావతిలో భూములు కొనుక్కోకూడదని ఎక్కడైనా రాశారా? చట్టంలో ఉందా అలా? వైసీపీ నేతలే దీనికి సమాధానం చెప్పాలంటూ బోండా ఉమ డిమాండ్ చేశారు.
ప్రతి విషయంపై వైసీపీ ఎంపీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సిట్ తీర్పును ఖాతరు చేయరు. ఏసీబీ కోర్టు తీర్పులై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పులపై మాట్లాడుతున్న వాళ్లకు.. గతంలో వచ్చిన తీర్పులు ఎందుకు గుర్తు లేవు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పట్లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది.. అంటూ బోండా ఉమ ఆరోపించారు.
లిక్కర్ షాపుల ద్వారా 20 వేల కోట్లు సంపాదిస్తున్న జగన్ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారా? 108 అంబులెన్సుల పేరుతో విజయసాయిరెడ్డికి 300 కోట్లు కట్టబెట్టడం ఏంటి? ఇన్ సైడర్ ట్రేడింగా? లేక వన్ సైడర్ ట్రేడింగా? అంటూ ఆయన దుయ్యబట్టారు.