భార్య పక్కన లేకపోతే అన్నం తినటం కూడా మానేసిన బాలీవుడ్ స్టార్ హీరో?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతకాలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన రణబీర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆలియా రణబీర్ బ్రహ్మాస్త్రం సినిమా విజయోత్సవ పనులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రణబీర్ కపూర్ తన భార్య ఆలియా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ క్రమంలో మీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు కదా ఇద్దరు ఒకరిమీద ఒకరు ఆధారపడుతున్నారా? అని తనకి ఎదురైన ప్రశ్నకు రణబీర్ సమాధానం చెబుతూ.. ‘ సాధారణంగా నేను ఇండిపెండెంట్ అని నా గురించి గొప్పలు చెప్పుకుంటాను. కానీ నేను ఎక్కువగా ఆలియా మీద ఆధారపడుతూ ఉంటాను. ఇక ఈమధ్య ఆలియా పక్కన లేకపోతే ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను. ఆమె పక్కన లేకపోతే తిండి తినటం కూడా మానేస్తున్నాను. ఆలియా ఏం చేసినా చేయకపోయినా కూడా ఆమె నా పక్కన కూర్చుంటే చాలు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రణబీర్ పక్కనే ఉన్న ఆలియా కూడా అతని వ్యాఖ్యలను ఏకీభవిస్తూ.. రణబీర్ అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాడు అందువల్ల నేను అతని పక్కనే ఉండి అన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటాను అని ఆలియా చెప్పుకొచ్చింది. 2017 నుండి ప్రేమలో మునిగిపోయిన ఈ జంట 2022 ఏప్రిల్ 14వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ఆలియా గర్భం తో ఉంది. తొందర్లోనే ఈ క్యూట్ కపుల్స్ ఇద్దరు తల్లిదండ్రులుగా మారనున్నారు.