విలవిల్లాడిపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. నో కలెక్షన్స్

Bollywood industry destroyed bigtime

Bollywood industry destroyed bigtime

కోవిడ్ లాక్ డౌన్ దెబ్బకు దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలు కుదేలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ అనంతరం మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగు పరిశ్రమ చాలా త్వరగా కోలుకుంది. జనవరి నుండి గత శుక్రవారం వరకు కనీసం పాతిక సినిమాలైనా రిలీజై ఉంటాయి. వాటిలో ‘క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, నాంది’ లాంటి హిట్ సినిమాలున్నాయి. లాక్ డౌన్ తరవాత భారీ వసూళ్లను రాబట్టుకున్న టాప్ త్రీ సినిమాలు తెలుగు చిత్రాలే కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీ కోలుకున్నంత వేగంగా టాప్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాలీవుడ్ కోలుకోలేకపోయింది.

ఇప్పటికీ థియేటర్లకు రావాలంటే ముంబైలో ప్రేక్షకులు జంకుతున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రధాన కారణమైతే థియేటర్లకు వెళ్లి చూడాలి అనేలా ప్రేక్షకుల్ని ప్రోత్సహించే సినిమాలేవీ రాలేదు. ఇటీవల విడుదలైన ‘రూహీ, ముంబైసాగ’ సినిమాలు ఆశించినంతగా వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు కరువయ్యారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాస్ అవుతున్నారు. అందుకే ఈ శుక్రవారం రిలీజ్ కావాల్సిన రానా నటించిన ‘హాతి మేరే సాతి’ చిత్రాన్ని వాయిదావేసుకున్నారు నిర్మాతాలు. కానీ తెలుగు, తమిళంలో మాత్రం చిత్రం విడుదలకానుంది. దీన్నిబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు.