Tiger Shroff: మామూలుగా తరచూ సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. వారు చిన్న మాట మాట్లాడిన చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ సినిమా షూటింగ్లో పాల్గొని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు.
అలా గతంలో కూడా సెలబ్రిటీలు ఖాళీగా ఉన్నప్పుడు గేమ్స్ ఆడిన వీడియోలు ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒక బాలీవుడ్ హీరో కూడా క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా , సదరు హీరో అందరి ముందు ఎలాంటి సిగ్గు బిడియం వంటివి లేకుండా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్.
తాజాగా ఒక షూటింగ్ లొకేషన్ లో మరో హీరో అక్షయ్ కుమార్, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య, ఆ షూటింగ్ కి సంబంధించిన పలువురితో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే కేవలం అండర్‌వేర్ మాత్రమే వేసుకొని తన బాడీని చూపిస్తూ క్రికెట్ ఆడాడు. ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటమే కాకుండా ఆ వీడియోని తనే స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పలువురు టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ ని పొగుడుతుంటే కొంతమంది మాత్రం ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఒక బాలీవుడ్ స్టార్ హీరో ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటం వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన అభిమానులు నెటిజెన్స్ క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు.