Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ ఎన్నో చిత్రాలలో నటించి చివరికి వైవాహిక జీవితలో ఒకటయ్యారు.ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరీనా కపూర్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెరపై సైఫ్-కరీనా జోడిని ఎప్పుడు చూడాలని అడగడంతో సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ ఆన్సర్ చెప్పారు.
కరీనాకపూర్ తను తెరపై కలిసి సందడి చేయడానికి తొందరేం లేదు. మా ఇద్దరిని భార్యాభర్తలు కాకుండా నటీనటులుగా తెరపై చూపించే దర్శకుడు, కథ దొరికితే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ తో కలిసి సినిమాలో నటించే విషయం గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. అప్పటి వరకు ఇతర నటీనటులతో సినిమాలు చేస్తామని సైఫ్ వెల్లడించారు.
అలాగే ఒకవైపు కరీనా కపూర్ తో కలిసి హాయిగా కలిసి జీవించడమే కాకుండా మరొకరితో కూడా సినిమాలలో నటించవచ్చు అనే భావన కూడా ఈయన వ్యక్తపరిచారు. కరీనా కపూర్ సినిమాల విషయానికి వస్తే ఆమె ఆమీర్ ఖాన్‌తో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ జనం ముందుకి రానుంది. మరో వైపు, సైఫ్ అలీఖాన్ ‘ఆదిపురుష్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో విలన్ రావణాసురుడి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.