‎Fahadh Faasil: కొత్త లగ్జరి కారు కొనుగోలు చేసిన ఫహద్ ఫాసిల్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

‎Fahadh Faasil: ఫహద్ ఫాసిల్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ఫహద్ ఫాసిల్. ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అద్భుతంగా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

‎ఈయన మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో క్రేజ్ ని మరింత పెంచుకున్నారు. ఇది ఇలా ఉంటే హీరో ఫహద్ ఫాసిల్ ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. తాజాగా ఈయన పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మలయాళీ హీరో ఫహద్ ఫాసిల్ కొత్త ఫెరారీ SUVను కొనుగోలు చేశారు. ఇటాలియన్ ఆటో మొబైల్ తయారీదారు ఫెరారీ ప్రారంభించిన మొదటి పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన పురోసంజ్వాను కొనుగోలు చేశారు ఫహద్.



‎ కేరళలో ఈ వాహనాన్ని సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా ఫహద్ ఫాసిల్ నిలిచారు. ఫెరారీకి చెందిన ఈ SUV మోడల్ ధర ఒకటి లేదా రెండు కోట్లు కాదు ఏకంగా 13.75 కోట్లు. ఫహద్, నజ్రియాల వద్ద విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఈ సెలబ్రెటీ కపూల్ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్, మెర్సిడెస్ బెంజ్ G63 AMG, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే 911 కారెరా, టయోటా వెల్‌ఫైర్, మినీ కంట్రీమ్యాన్, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఉన్నాయి. వాటితో పాటుగా తాజాగా ఈ కొత్త ఫెరారీ కార్ కూడా యాడ్ అయ్యింది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కారు ధర తెలిసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్, అభిమానులు.