మెగా స్టార్ ఇంట్లో సందడి చేసిన బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు.. వైరల్ అవుతున్న ఫొటోలు…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో ఇంట్లో ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే కూడా రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న”కభీ ఈద్ కభీ దివాళీ ” ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడి గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల వీరందరూ రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. స్టార్ సెలబ్రిటీలందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన వీరిని లంచ్‌కి ఆహ్వానించినట్టు సమాచారం. అందువల్లే వీరందరూ చెర్రీ ఇంట్లో వీరంతా సరదాగా గడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ సినిమాలో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ” కభీ ఈద్ కభీ దివాళీ ” అనే సినిమాలో రామ్ చరణ్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియదు.

ఈ క్రమంలోనే సల్మాన్ తరచు హైదరాబాద్‌ వస్తూ మెగా ఫ్యామిలీని కలుస్తూ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ తండ్రీ కోసం సల్మాన్ ఖాన్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి కమల్ హాసన్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో కూడా సల్మాన్ ఖాన్ పాల్గొని సందడి చేశారు. ఇక కభీ ఈద్ కభీ దివాళీ సినిమాలో వెంకటేశ్ తో పాటు జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.