పెళ్ళి తర్వాత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన అనుష్క శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అనుష్క శర్మ తెలుగులో కూడా సాహస వీరుడు సాగర కన్య సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. చేతి నిండా సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమించి వివాహం చేసుకుంది.

అయితే విరాట్ కోహ్లీతో వివాహం జరిగిన తర్వాత అనుష్క అడపాదడపా మాత్రమే సినిమాలో నటిస్తోంది. ఇక వీరికి కూతురు పుట్టిన తరువాత మరింతగా సినిమాలను తగ్గించింది. అంతేకాకుండా స్లేట్జ్‌ అనే నిర్మాణ సంస్థ నుండి కూడా తప్పుకుంటున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించింది. అనుష్క శర్మ ఇలా నిర్మాణ రంగం నుండి తప్పుకోవడానికి గల కారణాల గురించి ఇటీవల మీడియా వేదికగా తెలియచేసింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన అనుష్క శర్మ వివాహం జరిగిన తర్వాత ఉండే జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” కొన్ని సందర్భాలలో జీవితాన్ని ఆస్వాదించాలంటే పోటీ నుండి తప్పుకోవల్సి వస్తుంది. సినిమా రంగం అంటేనే నిత్యం పోటీతో కూడుకున్నది. ఈ రంగంలో అంతం అనేది ఉండదు. వివాహం జరిగిన తర్వాత వృత్తి మాత్రమే జీవితం కాదని తెలుసుకున్నా. అందువల్ల ఒకవైపు నటిగా, మరొకవైపు తల్లిగా భాద్యతలు సరిగా నిర్వహించటానికి వీలుపడదు. అందువల్ల కొన్ని సంవత్సరాలలో వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే వృత్తిని వదులుకోక తప్పదు. అందువల్ల
నిర్మాణ రంగం నుండి తప్పుకుంటున్నా” అని అనుష్క చెప్పుకొచ్చింది.