రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ నటుడఅనుపమ్ ఖేర్.. ఈగోస్టార్స్ ఇతనిని చూసి నేర్చుకోండి!

ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ సినిమాలు అని పేరు ప్రఖ్యాతలు సంపాదించాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయేలా తెలుగు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈగో స్టార్స్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ్ కేర్ ఈ విషయాన్ని తన మనసులో దాచుకోలేక బయట పెట్టేశారు.

ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఇంస్టాగ్రామ్ వేదికగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి అతను ఇంటరాక్టివ్ సెషన్ నుండి కొన్ని ఫోటోగ్రాఫ్ లను పంచుకున్నాడు. అంతేకాదు.. ఒక  స్వీట్ నోట్ ను కూడా రాశాడు. ఎంతో అద్భుతమైన వ్యక్తి గోవా ఫిలిం ఫెస్టివల్స్ లో భాగంగా ప్రముఖ రాజమౌళితో సంభాషణ కొనసాగించానని తెలిపారు.ఇతిహాసాలు ఉమ్మడి కుటుంబం చిన్న నాటి జ్ఞాపకాల గురించి అతనితో మాట్లాడటం ఎంతో సంతోషంగా అనిపించింది.  జై హో! #RRR #TheKashmirFiles #LearningExperience #Blockbusters #JoyOfCinema… అంటూ తన మనసులో ఉన్న సంతోషాన్ని తెలియజేశారు.

గత వారం నటుడు అనిల్ కపూర్ తో కలిసి తాను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాని చూశానని అనుపమ్ ఖేర్ తెలియజేస్తూ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. “@ssrajamouli #RRR చూసాను.ఎంతో అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రం ఈ సినిమాలో పాటలు హీరోల పర్ఫామెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, @AlwaysRamCharan & @tarak9999 #JrNTR ఇద్దరూ ఎలక్ట్రిఫైయింగ్ పాత్రలతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ అద్భుతం అంటూ చిత్ర బృందానికి @జయంతిలాల్గదా జీకి అభినందనలు! జై హో!” అని పోస్ట్ చేసారు. ఇలా ఒక స్టార్ నటుడు ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయకుండా తనలో ఉన్న భావాలను ఇలా బయట పెట్టారు.