గత ప్రభుత్వం టీడీపీ మీద చాలా వ్యతిరేకత రావడం, జగన్ పై నమ్మకం పెరగడంతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్ కూడా చాలా మంచి పనులు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అయితే.. రాజధాని అంశం మాత్రం ప్రస్తుతం ఏపీలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు ప్రస్తుతం అదొక్కటే చర్చగా మిగిలింది. ఎవరు ఏమన్నా.. అనకున్నా.. త్వరలోనే వైజాగ్ కు పరిపాలనా రాజధానిని షిఫ్ట్ చేసేందుకు జగన్ కూడా అన్నీ సిద్ధం చేస్తున్నారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ ఓకే కానీ… వైజాగ్ కు కంపెనీ వస్తాయా? పెట్టుబడులు పెడతారా? అనేది పెద్ద ప్రశ్న. అటువంటి ప్రశ్నలకు సమాధానమే ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సదస్సు. ఇటీవల పారిశ్రామిక సదస్సును నిర్వహించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలకు వైజాగ్ లో ఉన్న అనుకూలతలను వివరించారు. దీంతో పారిశ్రామికవేత్తలు కూడా వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.. అనేది ఏపీ ప్రభుత్వం వాదన.
వైజాగ్ లో కంపెనీలు వస్తే.. ఉద్యోగాలు వస్తాయి. అంటే.. లోకల్ గా ఉన్న యూత్ కే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే.. వైజాగ్ కు పరిపాలనా రాజధాని రావడం వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదు. ఒకవేళ రానున్న రోజుల్లోనూ వైజాగ్ పరిపాలనా రాజధానిగానే ఉంటే.. కంపెనీలు ఇక్కడికి తరలివస్తే… వైజాగ్ అభివృద్ధి శరవేగంగా పెరుగుతుందని… దీనికి కారణమైన వైఎస్ జగన్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారన్న ప్రచారం ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?