బీజేపీ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తోంది ?

బీజేపీ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తోంది ?
ఆంధ్రా బీజేపీ శాఖలో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  అధ్యక్షుడి మార్పుతో పాటు టీడీపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించడం, 2024 నాటికి ప్రతిపక్ష స్థానంలో కొర్చొడవడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న ఆ పార్టీ తాజాగా మరొక డెసిషన్ తీసుకుంది.  అదే సోషల్ మీడియాలో ఎవరైనా తమ పార్టీ గురించి, నేతళ గురించి తప్పుడు ప్రచారం చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ ప్రకటించింది.  ప్రకటన అంటే ఏదో మొక్కుబడి ప్రకటన కాదు నేరుగా వార్నింగ్యారెంటెస్ ఇచ్చేసింది.  రాష్ట్రంలో, దేశంలో ఉండం కదా అని ప్రవాసులు ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే వారి మీద కూడా కఠినమైన లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

బీజేపీ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తోంది ?

 
 
ఇంతలా ఫేక్ ప్రచారం మీద కదం తొక్కుతున్న కాషాయ దళం గతంలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎన్ని చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  తమకు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా వ్యవహరిస్తున్నాడు అంటే బీజేపీ వారి మీద మొదటగా సంధించే అస్త్రం ఫేక్ ప్రచారం.  పలానా నేత పలానా పార్టీలోకి మారుతున్నారు, ఆ పార్టీలో ముఖ్యుడిగా ఉన్న నాయకుడికి ఇకపై అక్కడ విలువ లేదు, పలానా పార్టీకి ఆ పార్టీ నాయకుడే గోతులు తవ్వేస్తునాడు లాంటి ప్రచారాలు కాషాయ దండుకు కొత్తేమీ కాదు. 
 
అసలు దేశంలో సామాజిక మాధ్యమాలను బీజేపీ వాడుకున్నంతగా మరో పార్టీ వాడుకోలేదనేది నిజం.  ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకున్నప్పుడు బీజేపీ ముందుగా సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీ నుండి బీజేపీలోకి ఎమ్మెల్యేలు జంప్ అంటూ ప్రచారం స్టార్ట్ చేసి.. చివరకు దాన్నే నిజం చేస్తుంది.  కుదరకపోతే అంతా ఫేక్ అని తెలిశాఖ తమకేమీ సంబంధం లేదని చేతులెత్తేస్తుంది.  అలాంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు తమ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము అంటుండటం చూసిన జనం ఈ ఓవరాక్షన్ ఏంటి నాయనా అనుకుంటున్నారు.