జగన్ గెలవాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి

jagan modi telugu rajyam

 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తలకు మించిన భారం ఎత్తుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. పోయిపోయి ఏకంగా న్యాయ వ్యవస్థను ఢీకొట్టటానికే సిద్దమయ్యాడు. దేశంలో బలమైన వ్యవస్థగా వెలుగొందుతూ, రాజకీయ వ్యవస్థలను కూడా కంట్రోల్ చేయగలిగే సత్తా కలిగిన న్యాయవస్థతో జగన్ ఈ రకంగా ఎదురురెళ్లటం అనేది సామాన్యమైన విషయం కాదు. జగన్ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

cm jagan telugu rajyam

 

 ఇందులో న్యాయం, అన్యాయం అనే విషయాలు కాసేపు పక్కన పెడితే, జగన్ ఇందులో కచ్చితంగా విజయం సాధించాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి, న్యాయ వ్యవస్థపై డైరెక్ట్ గా పెత్తనం చేయలేని కేంద్రం, అందులోని కొందరిని తమకు అనుకూలంగా మలుచుకోవడం, తమకి ఉన్న అసాధారణమైన చట్టాలు లను చూపించి దొడ్డిదారిలో న్యాయ వ్యవస్థపై పట్టు సాధిస్తుంది అనేది జగమెరిగిన సత్యం.
సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు కు తర్వాత కాబోయో చీఫ్ జస్టిస్ మీదే ఆరోపణలు చేస్తూ లేఖలు రాయటం జరిగింది. ప్రస్తుతం వున్నా ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. జగన్ రాసిన లేఖ అన్ని అవరోధాలు దాటుకొని విచారణకు వస్తే, ఎవరి మీదయితే ఆరోపణలు చేశారో, ఆయనే ప్రధాన న్యాయమూర్తిగా ఉండటంతో కేసు విచారణ జరగటం కష్టం. అలాగని ఆ కేసును కింద స్థాయి కోర్టులు విచారిస్తే జగన్ కు అనుకూలంగా ఫలితం రాదు.

  ఇక జగన్ గెలవాలంటే ఏకైక మార్గం బీజేపీ మద్దతు. ఇందులో కేంద్రం కలగచేసుకుంటే కొన్ని కీలకమైన మార్పులు జరిగి జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఆపగలికే అవకాశం లేకపోలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావటానికి ప్రధాన అర్హత సీనియారిటీ. ఆ లెక్కన జస్టిస్ రమణకు అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఆయన్ని పక్కకు తప్పించి ఆ స్థానంలో మరొకరిని కుర్చోపెట్టే ఛాన్స్ లేకపోలేదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేకపోలేదు. అదే కనుక జరిగితే జగన్ విజయం సాధించినట్లే లెక్క, అయితే జగన్ కోసం కేంద్ర పెద్దలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అనేది అనుమానమే..? అయితే కొందరేమో ఇప్పటికే కేంద్రం మద్దతు జగన్ కి వుంది. ఢిల్లీ వెళ్లిన వచ్చిన తర్వాతే న్యాయ వ్యవస్థపై పోరాటం మొదలుపెట్టాడంటూ అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో అవాస్తవమెంతో తెలియని పరిస్థితి.