మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తిరుగులేని హీరో. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన చేస్తున్న డాన్స్ లకు, నటనకు ఇప్పటికి అభిమానులు తగ్గలేదు. అయితే సినిమాల్లో ఎవరు అందుకోలేని ఎత్తులో ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తాను అనుకున్న స్థానాన్ని చేరుకోలేకపోయారు. సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్రానికి సేవలు చేయాలని అనుకున్నారు కానీ రాజకీయాల్లో ఆయన చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన కోలుకోలేని దెబ్బలు ఎన్నో తగిలాయి. చివరికి పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీని కూడా నడపలేక దాన్ని కాంగ్రెస్ విలీనం చేశారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాలకు చిరంజీవి చుట్టూ తిరుగుతున్నాయి.
చిరు చుట్టూ తిరుగుతున్న బీజేపీ రాజకీయాలు
తాజగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు కలుగచేస్తున్నాయి. సోము వీర్రాజు పక్కా మెగా ఫ్యామిలీ భక్తుడు అంటూ హర్షకుమార్ ఈ మధ్య కామెంట్స్ చేశారు. ఆయన చిరంజీవి కుటుంబానిని వీర భక్త హనుమాన్ అని కూడా పోల్చారు. చిరంజీవిని సీఎం చేయడం కోసమే సోము వీర్రాజు రాజకీయం చేస్తున్నారు అని కూడా అన్నారు. మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడంతో సోము దిట్ట అనేశారు. ఆయనకు సొంత సామాజికవర్గం మీద మమకారం మెండు అని కూడా కామెంట్స్ చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అయితే జనసేన కుల రాజకీయాలు చేస్తోందని కూడా హర్ష కుమార్ విమర్శించారు.
సీఎం కుర్చీపై చిరుకు ఇంకా మోజు ఉందా!
మూవీస్ వదిలి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిందే సీఎం కుర్చీపై కూర్చొని ప్రజలకు సేవ చేయాలని అయితే చిరు రాజకీయాల్లో ఘోర పరాజయం పొందారు. కేవలం 18% ఓట్లకే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు బీజేపీ వల్ల చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రానున్న రోజుల్లో పొత్తులో ఉన్న జనసేన-బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు చిరంజీవి సీఎం కుర్చీ అధిరోహించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.