బీజేపీ డిమాండ్‌తో.. చంద్ర‌బాబు అండ్ బ్ర‌ద‌ర్స్‌కి మూడిన‌ట్లేనా..‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఫుల్‌గా యాక్టీవ్ అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న బీజేపీ, ఒక‌వైపు అధికార వైసీపీని మెల్ల‌గా టార్గెట్ చేస్తూనే, మ‌రోవైపు టీడీపీని ఉతికి ఆరేస్తుంది. గ‌త ఎన్నిక‌ల టైమ్‌లో బీజేపీతో ఊహించ‌ని విధంగా టీడీపీ వైరం పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో మ‌రోసారి టీడీపీతో కాపురం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ తెలుగుదేశం పార్టీకి కాషాయం పార్టీ చాన్స్ ఇవ్వ‌డంలేదు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీ హ‌యాంలో అమ‌రావ‌తి భూకుంభ‌కోణంలో టీడీపీకి చెందిన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో సహా 12 మందిపై ఏసీబీ చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ, తాజాగా ఏపీ హైకోర్టు స్టే ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టికే హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వుల పై రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విమర్శలు పెద్ద ఎత్తున‌ వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి భూకుంభకోణంలో తన అవినీతి బయటపడకుండా వ్యవస్థలను సైతం మ్యానేజ్ చేస్తూ స్టే ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారని చంద్ర‌బాబు పై ఇప్ప‌టికే అధికార వైసీపీ విమర్శలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా చంద్ర‌బాబు అవినీతి పై విరుచుకుప‌డుతోంది. నేడు హిందూ ఉద్దార‌కుడిగా తెగ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుత‌న్న చంద్ర‌బాబు, నాడు చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు దేవాల‌యాలు కూల్చి వేశార‌ని బీజేపీ ఆరోపిస్తుంది.

ముఖ్యంగా గ‌తంలో గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చికి 35 మందిని చంద్ర‌బాబు బలి తీసుకున్నార‌ని బీజేపీ ద్వ‌జ‌మెత్తుతోంది. ఈ క్ర‌మంలో అమరావతిలో జ‌రిగిన‌ భూకుంభకోణం పై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేయ‌డంతో చంద్రబాబు అండ్ త‌మ్ముళ్ళ‌కు మైండ్‌బ్లాక్ అవుతోంది. దీంతో అమరావతి భూకుంభ‌కోణం పై సీబీఐ ద‌ర్యాప్తుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని టీడీపీ నేత‌లు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఏది ఏమైనా కాషాయం ద‌ళం దెబ్బ‌కి ప‌సుపు బ్యాచ్ మూడు చెరువుల నీళ్ళు తాగ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.