తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యం చెలాయించారు. తన కారును ఆపినందుకు వారిని గట్టిగా హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉండటంతో పోలీసులు ఆయన కారును నిలిపే ప్రయత్నం చేశారు.
ఇక సోము వీర్రాజు.. తన కారు ని అలా ఆపటంతో దౌర్జన్యానికి దిగారు. ఎస్ ఐ ని వెనక్కి తోస్తూ బెదిరించారు. నా కారు ఎవరు ఆపమన్నారు.. నేను నీతో మాట్లడను నేరుగా మీ ఎస్పీతో మాట్లాడుతా అంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా తన కారు ఎదుట మరో వాహనం ఉండటంతో అతడి పై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు.