ఏపీ రాజకీయాల్లో క్రమక్రమంగా వస్తున్న మార్పులు చివరికి ఏ పార్టీకి అనుకూలంగా మారుతాయో తెలియని పరిస్దితులు నెలకొంటున్నాయి.. కానీ ఎన్ని గడ్దు పరిస్దితులు ఎదురైన వాటన్నీంటిని సర్ధవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్.. ఎందుకంటే సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు అనే పేరు ఇప్పటికే తన పాలనలో సుస్ధిరం చేసుకున్నాడు.. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందా అనే అనుమానం మాత్రం కొందరిలో నెలకొంటుందట. అదీగాక కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహంతో ఏపీ సీఎం జగన్ కు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి.. అవి రాజకీయ కారణాలుగా మారి.. ఇక్కట్లు తెస్తున్నాయా అంటే.. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తున్న కొందరు పరిశీలకులు ఔననే అంటున్నారు..
రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీకి రావల్సిన నిధులు ఇంకా విడుదలకు నోచుకోలేదు. అదీగాక ప్రత్యేక హోదా విషయం తేల్చాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన ఐదు వేల కోట్ల రూపాయలను కూడా రీయింబర్స్‌మెంట్ చేయాల్సింది కేంద్రమే. అంతే కాకుండా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి, జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవన్ని లెక్కలోకి తీసుకుంటే దాదాపు పాతిక వేల కోట్ల వరకు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటి విషయంలో రాష్ట్ర సర్కారు తరఫున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయన ఢిల్లీ టూరుకు వెళ్లి .. మంత్రులను కలుస్తున్నారు. అయినా.. కేంద్రం శీతకన్నేస్తూనే ఉందట. పైగా.. మేం ఇవ్వం.. మీరు అప్పులు చేసుకోండి అని చెబుతున్న విషయం కూడా తెలిసిందే.
అయితే ఏపీ అభివృద్ధి ఆగకుండా, ప్రజలకు కష్టం కలగకుండా సీయం జగన్ తన పనేదో తాను చేసుకుంటున్నారు.. కానీ ఆయనను అదే బీజేపీ నేతలు వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతోందని, సీయం జగన్ కు పాలించడం రావడం లేదని, ప్రభుత్వం అప్పులు చేసేసి.. ప్రజల నెత్తిన కుంపటి పెడుతోందన్న ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఏపీ సర్కారు పై విరుచుకు పడ్డ విషయం విదితమే.. ఇక ఇలాంటి మాటల వల్ల వైఎస్ జగన్ సీటుకే ముందు ముందు ఎసరు వచ్చేలా ఉంది, అడిగితే అమ్మ పెట్టదు, తనను తిననివ్వదు అన్నట్లుగా బిజేపీ ప్రవర్తిస్తుందని అనుకుంటు వున్నారట వైసీపీ నాయకులు.. మరి చూడాలి బీజేపీ చేస్తున్న రాజకీయం ఎంతవరకు వైఎస్ జగన్ కు చిక్కుముడిలా మారుతుందో..