KCR: ఈటెలకు ఫోన్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్… సొంతగూటికి ఆహ్వానం పలుకుతున్నారా?

KCR: తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా కెసిఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీని సొంతం చేసుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది.

ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎంతోమంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అయితే కెసిఆర్ కు ఎంతో నమ్మకస్తుడు అయినటువంటి ఈటెల రాజేంద్రనాథ్ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పలు భూ వివాదాల కారణంగా పార్టీ సస్పెండ్ చేయడంతో ఆయన బిజెపిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బిజెపిలో ఎంపీగా కొనసాగుతున్న ఈటెల రాజేంద్రకు గులాబీ బాస్ కెసిఆర్ ఫోన్ చేశారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటెలను తిరిగి సొంతగూటికి ఆహ్వానిస్తూ కేసీఆర్ ఫోన్ చేశారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటెల స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈటల రాజేందర్.. కీలక విషయాలు వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా అంటూ.. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈటల తనదైన శైలిలో స్పందించారు.

తామంతా ఎంతో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులమని తెలిపారు. ఇదేమైనా పిల్లలాట అనుకుంటున్నారా. వారి పార్టీ వారిది మా పార్టీ మాది. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అని అందుకోసమే తాము పని చేస్తామని తెలిపారు. ఇక తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు చేస్తున్న అసత్యపు ప్రచారం మాత్రమేనని ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటూ ఈటెల క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన మాటలను బట్టి చూస్తుంటే తిరిగి కెసిఆర్ చందన చేరేలాగా లేరని స్పష్టమవుతుంది.