తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికే ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గ్లామర్ ను వాడుకోవడానికి బీజేపీ సిద్ధపడింది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన తెలంగాణలో కూడా స్థిరపడటానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కానీ అవేవి ఫలించడం లేదు. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో బలమైన నాయకత్వం లేకపోవడం. ఈ నాయకత్వ లేమిని పూడ్చడానికి బీజేపీ రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నారు.
రేవంత్ పై శ్రద్ద పెట్టిన బీజేపీ
రేవంత్ రెడ్డికి క్రేజీ పార్టీలకు అతీతం. తెలంగాణలో కేసీఆర్ తరువాత ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన ప్రస్థుతానికి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయనకు టీడీపీలో ఉన్నప్పటి నుండే మాంచి క్రేజ్ ను సంపాదించారు. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ ను బీజేపీ నేతలు వాడుకోవడానికి సిద్దమవుతున్నారు. రేవంత్ రెడ్డికి టీడీపీ నుండి కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతును కూడా బీజేపీ నేతలు వాడుకోవలనుకుంటున్నారు. బండి సంజయ్ ని, ధర్మపురి అరవింద్ ని కిషన్ రెడ్డి ఒప్పించి రేవంత్ ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.
కాంగ్రెస్ రేవంత్ కు మద్దతు ఇవ్వడం లేదా!
కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల వల్ల రేవంత్ రెడ్డికి తగిన గుర్తింపు లభించడం లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ ను కాంగ్రెస్ నాయకులు వాడుకోవడంలో విఫలమవుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు కూడా కాంగ్రెస్ నేతలు పూర్తి మద్దతు ఇవ్వడం లేదు. రేవంత్ ను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు రేవంత్ ను పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని వర్క్ ఔట్ అయితే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని బీజేపీలో చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.