కేసీఆర్ కు దిమ్మతిరిగే వ్యూహం రచించిన బీజేపీ, ఈ దెబ్బతో టీఆర్ఎస్ నాయకులు ఇక ఇంటికే

KCR and BJP in GHMC polls

తెలంగాణలో తమకు రాజకీయంగా ఎలాంటి ఎదురు లేదని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ నాయకులు ఊహించని రీతిలో బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తుంది. మొన్న దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బీజేపీ నాయకులు ఏ రేంజ్ లో ఆడుకున్నారో అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఎన్నికల సమయానికి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకోసమే బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించి కేసీఆర్ పై ప్రయోగించనున్నారు. ఈ దెబ్బతో టీఆర్ఎస్ యొక్క పునాదులు కదలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

త్రిపుర తరహా వ్యూహం

కర్ణాటక తరువాత బీజేపీకి సౌత్ లో ఆశాజనకంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ కాబట్టి బీజేపీ పెద్దలు ఇక్కడ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. అందుకే ఇక్కడ గతంలో త్రిపురలో ప్రయోగించిన వ్యూహాన్ని ఇక్కడ ఉపయోగిచనున్నారు. త్రిపురలో గ్రామల్లో పార్టీని స్థిరపరచడానికి సంఘ్ సేవలను ఉపయోగించిన బీజేపీ పెద్దలు, ఇప్పుడు తెలంగాణలో కూడా సంఘ్ సేవకులను ఉపయోగించనున్నారు. ఇప్పటికే కొందరు సంఘ్ సేవక్ లను ఎంపిక చేసి వారిని తెలంగాణకు పంపే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరంతా తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉంటూ అక్కడ పార్టీని పటిష్టం చేయనున్నారు. ఇలా పటిష్టమైన పథకం ప్రకారం టీఆర్ఎస్ ను దెబ్బతియ్యడానికి బీజేపీ పెద్దలు పథకం రచిస్తున్నారు.

బీజేపీని కేసీఆర్ ఎదుర్కొనగలరా!!

బీజేపీ తెలంగాణలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డితో పాటు మరొకరికి ఇవ్వాలని గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇలా వ్యూహం ప్రకారం తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కేసీఆర్ అడ్డుకోగలడా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.