ఎలక్షన్ యుద్ధం : కే‌సి‌ఆర్ కి కనీ వినీ ఎరుగని షాక్ సిద్ధం?

jp nadda sensational comments on cm kcr

తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలో సీఎం కేసీఆర్ తన హవాను చుపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను కూడా కేసీఆర్ మూలకు కూర్చోబెట్టారు. కనీసం తెలంగాణలో తనకు పోటీ లేకుండా చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ తన హవాను చుపించారు. అయితే 2020లో జరిగిన అనేక అద్భుతాల్లో కేసీఆర్ ను ఢీకొట్టే పార్టీ కూడా బయటకు వచ్చింది. ఆ పార్టీనే బీజేపీ. తెలంగాణ కంచుకోట అయిన దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణలో జెండాను ఎగరవేయడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

bjp leader nvss prabhakar fires on cm kcr
bjp leader nvss prabhakar fires on cm kcr

జీహెచ్ఎంసీలో బీజేపీ హవా కొనసాగిస్తుందా!!

దుబ్బాక ఎన్నిక ఇచ్చిన ఉత్సహంతో బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయ పతాకం ఎగరవేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి ఏకంగా బీజేపీ పెద్దలు కూడా రాష్ట్రానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ కు రావడం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికే వచ్చారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, యోగి అదిత్యనాథ్ కూడా హైదరాబాద్ లో ప్రచారం కూడా చేశారు. అలాగే బీజేపీ నేతలు కూడా హైదరాబాద్ ప్రజలకు ఇష్టమొచ్చిన హామీలను ఇస్తున్నారు. మరి హైదరాబాద్ లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తుందో లేదో వేచి చూడాలి.

కేసీఆర్ కు పరాభవం తప్పదా!!

రెండుసార్లు సీఎంగా కేసీఆర్ ఎన్నిక అవ్వడం వల్ల ఓవర్ కాంఫిడెన్స్ పెరిగింది. ఆ అతి విశ్వాసంతో కేసీఆర్ కనీసం దుబ్బాక ఎన్నికల్లో ప్రచారం కూడా చెయ్యలేదు. బీజేపీ గెలిచింది కేవలం కొన్ని ఓట్ల తేడాతోనే,ఒకవేళ కేసీఆర్ చివర నిమిషంలోనైనా ప్రచారం చేసి ఉంటే గెలుపు వచ్చేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దుబ్బాక ఎన్నిక విషయంలో చేసిన తప్పుకు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూల్యం చెల్లించనుంది. అలాగే ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే అక్కడ కూడా విజయ పతాకం ఎగురవేసేలా కనిపిస్తుంది. టీఆర్ఎస్ నాయకులు చేసిన ఒక్క తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటుంది.