ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు పార్టీ మారడానికి చూస్తున్నారు. మొదట ఆయన వైసీపీలోకి వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీలోని స్థానిక నాయకుల నుండి వ్యతిరేకత రావడం వల్ల వైసీపీలోకి తీసుకోవడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వెనడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి ఏపీలో పలు పార్టీలు ఎగపడుతున్నాయి. గంటా ఇప్పుడు ఏపీలో హాట్ కేక్ లా మారారు.
వద్దన్న వైసీపీ, రమ్మంటున్న బీజేపీ
టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళడానికి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ విశాఖపట్నంలో ఉన్న స్థానిక వైసీపీ నాయకులు మాత్రం గంటా పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో జగన్ రెడ్డి కూడా గంటాను పార్టీలోకి తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇదే అదునుగా చూసుకున్న బీజేపీ గంటాకు గాలం వేస్తుంది. ఏపీలో రాజకీయంగా బలపడటానికి ప్రయత్నిస్తున్న బీజేపీ గంటాను ఎలాగైనా పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమైంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కూడా బీజేపీ నాయకులు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. గంటాను బీజేపీలోకి తీసుకుంటే ఒక మూడు జిల్లాల్లో పార్టీ బలపడినట్టని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
టీడీపీ నుండి బయటకు రాడా!!
టీడీపీ యొక్క పార్టీ కార్యకలాపాలకు గంటా శ్రీనివాసరావు చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నారు. దాదాపు పార్టీ నుండి, పార్టీ నేతల నుండి దూరంగా ఉంటున్నారు కానీ పార్టీ నుండి అధికారికంగా బయటకు రావడం లేదు. ఎందుకు ఇంకా పార్టీలో ఉన్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. జగన్ అవకాశం ఇస్తే వైసీపీలోకి వెల్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏ పార్టీకి చెందని నాయకుడిగా ఉన్నారు. రానున్న రోజుల్లో గంటా రాజకీయ జీవితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.