2022లో జమిలి ఎన్నికలకు బీజేపీ శ్రీకారం చుట్టిందా!!

Russian President Vladimir Putin endorsed PM Modi’s emphasis on terrorism

దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని దెబ్బకొట్టగలిగే పార్టీ లేదు. అసలు బీజేపీకి ఏదేశంలో ఎదురే లేదన్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి నిదర్శనం బీహార్ మరియు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు. బీహార్ ఎన్నికల్లో బీజేపీపై వచ్చిన వ్యతిరేక అంతా ఇంతా కాదు. అయినా అక్కడ మళ్ళీ అధికారం చేపట్టగలిగింది. అలాగే తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీగా నిలబడి బీజేపీ విషయం సాధించింది. ఈ విజయాలు ఇస్తున్న ఊపుతో బీజేపీ తన కలను నెరవేర్చుకోబోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

pm modi
pm modi

2022లో జమిలి వచ్చేనా!!

ఇపుడున్న పరిస్థితుల నుంచి గరిష్ట రాజకీయ లబ్దిని పొందేందుకు బీజేపీ ప్రయత్నించకుండా ఉంటే తప్పు చేసినట్లే. అందువల్ల ఆ తప్పు అసలు చేయదు. అందుకే 2022లో జమిలి ఎన్నికలకు రెడీ అవుతుంది అంటున్నారు. దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉన్న వేళ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు కలుపుకుని ఒకేసారి ఎన్నికలకు వెళ్ళి మళ్లీ మోడీని ప్రధానిగా ప్రతిష్టించాలన్న బీజేపీ పెద్దల ఆలోచన. వీలైన్నంత త్వరగా జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీపై మెల్లగా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే మొత్తనికే సమస్య వస్తుంది కాబట్టి ఆ భావజాలం బలపడేలోపు జమిలి ఎన్నికలు వెళ్ళడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ద

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండాను పాతడానికి బీజేపీ పెద్దలు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్న వేళ బీజేపీ తెలుగు రాష్ట్రాలపై మరింత శ్రద్ద పెట్టిందని, అలాగే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సంకేతంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ప్రజలకు బీజేపీకి ఇచ్చిన ఈ విజయంతో బీజేపీ నాయకులు ఏపీ, తెలంగాణలో రెట్టింపు ఉత్సహంతో పని చేస్తున్నారు. ఏపీలో తమ సత్తాను చాటుకోవడానికి తిరుపతిలో జగనన్న ఉప ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. జమిలి ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.