ఎన్డీఏలోకి టీడీపీ.. చంద్రబాబు, పవన్ కోరుకున్నదే జరుగుతోందా?

BJP To Join Hands With TDP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే వైసీపీ పాలన మెరుగ్గానే ఉందని చాలామంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు వయస్సు పెరుగుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీకి మిగిలిన ఏకైక ఆప్షన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం టీడీపీకి నష్టమే తప్ప లాభం ఉండదు.

అయితే ఢిల్లీలోని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏలోకి టీడీపీ చేరనుంది. బీజేపీ అనుకూల మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతుండటంతో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని చాలామంది భావిస్తున్నారు. అయితే బీజేపీ టీడీపీపైనే ఆసక్తి చూపడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఏపీలో వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని అనుకున్నా వైసీపీ అందుకు అంగీకరించదు.

ఎన్డీఏలో చేరాలని బీజేపీ ప్రతిపాదన పెట్టినా ఆ ప్రతిపాదనకు వైసీపీ అంగీకరిస్తుందో లేదో చెప్పలేము. ఎన్డీఏలో ప్రస్తుతం గుర్తింపు ఉన్న పార్టీలు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో మోదీ, అమిత్ షా ప్రస్తుతం కొత్త పార్టీలపై దృష్టి పెట్టారు. అయితే అటు టీడీపీ ఇటు బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలకు పెద్ద పీట వేస్తాయి. ఎన్డీఏలోకి టీడీపీ చేరితే వైసీపీకి మాత్రం భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలనే ఆలోచనతో బీజేపీ అడుగులు వేస్తుండటం గమనార్హం. టీడీపీ, బీజేపీ కలిసి పని చేసినా అటు ఏపీలో ఇటు తెలంగాణలో లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడును చేర్చుకోవడం వల్ల పొలిటికల్ గా ఏపీకి కలిగే బెనిఫిట్ కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 2024లో ఏపీలో పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. చంద్రబాబు, పవన్ కోరుకున్నదే జరుగుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.