ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బ్రేకింగ్ న్యూస్ : కాపులకి పండగలాంటి వార్త !

Bjp being silent because of Ys jagan plan

 

రాజకీయాలంటేనే చదరంగంలోని గడుల లాంటివి అంటారు అనుభవజ్ఞులు.. ఇక్కడ దీర్ఘకాలం పదవుల్లో కొనసాగాలంటే ఎత్తులు బాగా వేయాలి, ప్రత్యర్ధులను గుప్పిట్లో పెట్టుకోవాలి.. అవసరం అనుకుంటే కుల రాజకీయాలు కూడా చేయాలి.. ఆ అన్నట్లు రాజకీయాల్లో మతం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. ఇలాంటి రాజకీయాలు చేయని వారు ఎక్కువ కాలం అధికారంలో గానీ, రాజకీయాల్లో గానీ నిలబడలేరు.. ఇప్పుడు ఇదే సిద్దాంతంతో బీజేపీ ముందుకు వెళ్లుతుందంటున్నారు.. రానున్న నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో పాగా వేయాలని ఆలోచిస్తున్న బీజేపీ తాజాగా కుల రాజకీయాల పైనా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కాస్త ఆలస్యంగా అయినా ఏపీలో బలపడాలంటే ఏం చేయాలనే విషయాన్ని గుర్తించిన కమళం ఇందుకు పక్కా ప్రణాళికను సిద్దం చేసుకుంటుంది..

ఇప్పటికే ఏపీలో టీడీపీ బలహీనంగా మారింది.. ఇక వైసీపీలో కూడా కుల రాజకీయాలు కొనసాగుతున్నాయి.. వీటికి తోడు జనసేన పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంటాము అనే అభిప్రాయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందట.. అదీగాక ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనకు పదును పెట్టినట్టుగా కనిపిస్తోంది కమళం.. ఇందులో భాగంగా కాపు సీఎం అనే వార్తను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది.

ఇదే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, బీజేపీ గనుక ఇక్కడ పాగా వేస్తే ఈ ఇద్దరిలో ఒకరిని సీఎం చేసే అవకాశాన్ని పరిశీలిస్తారనే ప్రచారం కూడా మొదలైంది.. ఇక బీజేపీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే కాపు సామాజిక వర్గం మద్దతు చాలా అవసరం. అందువల్ల ఆ సామాజిక వర్గం లోని నాయకులందరినీ తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుండే మంతనాలు ప్రారంభించింది. ఒకరకంగా ఏపీ కాపులకు ఈ వార్త ఆనందం కలిగించేలా ఉందంటున్నారు.. మరి ఏపీ రాజకీయాల్లో ఈ కుల రాజకీయం ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి..