సినిమాలకు సెంటిమెంట్ గా మారిన బిత్తిరి సత్తి.. ఈసారి కూడా పక్కా కమర్షియలే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి పెద్దఎత్తున సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా హిట్ అవుతుందని తెలిస్తే ఎంతటి కష్టమైన ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ సినిమాను విజయపథంలో నడిపించడానికి కృషి చేస్తుంటారు. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది ఇలాంటి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా హిట్ కావాలంటే బిత్తిరి సత్తి సెంటిమెంట్ ట్రెండ్ అవుతుంది.బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేస్తే సినిమా పక్కా హిట్ అనే సెంటిమెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేసిన త్రిబుల్ ఆర్, మహేష్ బాబు సర్కారీ వారి పాట, విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3, విరాటపర్వం సినిమాలకు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశారు.ఈ సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడంతో ఈయన సినిమాలకు సెంటిమెంట్ గా మారిపోయాడు. ఈయన ఇంటర్వ్యూ చేస్తే సినిమా మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ అనే టాక్ ఉండడంతో సెలబ్రిటీలు అందరూ కూడా ఆయనతో ఇంటర్వ్యూలో పాల్గొనడం కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ వారం విడుదల కానున్న పక్కా కమర్షియల్ సినిమా కూడా హిట్టే అని అందరూ భావిస్తున్నారు.

ఇప్పటికే గోపీచంద్ రాశి ఖన్నాజంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కూడా పక్కా హిట్ అంటూ ఇప్పటికే అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.