హాట్ యాంకర్‌తో ఆ యంగ్ డైరెక్టర్ ‘హాట్ అండ్ వైల్డ్’ మూవీ.!

చాన్నాళ్ళ క్రితం ఓ సినిమాకి దర్శకత్వం వహించాడాయన. ఆ తర్వాత ఎందుకో కెరీర్‌లో అంత వేగం చూపించలేకపోయాడు. నటుడిగా కూడా మారాడు. హిట్టు సినిమా తీసి కూడా, ఎందుకు ఆ యంగ్ డైరెక్టర్ సినిమాలు వేగంగా చెయ్యలేకపోతున్నాడు.? అన్నది చాలామంది డౌట్.! నిజానికి, ఆ దర్శకుడికి యంగ్ హీరోల్లో చాలామందితో మంచి పరిచయాలున్నాయి. కానీ, దర్శకుడిగా కొత్త సినిమా మొదలెట్టడానికి తటపటాయిస్తున్నాడు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ యంగ్ డైరెక్టర్, సినీ నటిగా పాపులర్ అయిన ఓ యాంకరమ్మతో హాట్ అండ్ వైల్డ్ మూవీని ప్లాన్ చేశాడట. ఇదొక థ్రిల్లర్ అని తెలుస్తోంది.

తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్ అండ్ వైల్డ్ అలాగే బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే, సంక్రాంతిలోపే సినిమాపై అనౌన్స్‌మెంట్ రావొచ్చునని అంటున్నారు. కంటెంట్ మాత్రం చాలా రిచ్‌గా వుంటుందట. మోర్ డిటెయిల్స్ ముందు ముందు వెల్లడవుతాయ్. ఆ యాంకర్ గతంలోనూ ఆ దర్శకుడితో పని చేసిందిట.