Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : ఆహా అనిపించే కథ!

(చిత్రం : అన్ స్టాపబుల్, విడుదల తేది : జూన్ 09, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: వి.జె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు. దర్శకత్వం : డైమండ్ రత్న బాబు, నిర్మాతలు: రంజిత్ రావు, సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి, ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్).

బిగ్ బాస్ విన్నర్ సన్నీ, ప్రఖ్యాత హాస్యనటుడు సప్తగిరి నటించిన సినిమా ‘అన్ స్టాపబుల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు అందరిలో ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్ టైనర్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ : కోహినూర్ కళ్యాణ్ (వి.జె సన్నీ), జిలాని రామదాస్ (సప్తగిరి) తన చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని ఓ క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకుంటారు. దీనితో డబ్బుల కోసం తమ మరో ఫ్రెండ్ హనీ బాబు (షకలక శంకర్) సాయం కోరగా.. తను పొరపాటున ఆ డబ్బులు జ్ఞ్యానవేల్ రాజా అలియాస్ ఖాదర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. తీరా కట్ చేస్తే ఆ ఖాదర్ ఓ పేరుమోసిన డాన్. మరి ఈ పరిస్థితి నుంచి కళ్యాణ్ జిలానీలు ఆ డబ్బులు ఎలా రాబట్టుకున్నారు? జిలాని తన చెల్లి పెళ్లి చేశాడా? లేదా? అనేది అసలు సిసలైన ఆసక్తికరమైన కథ!

విశ్లేషణ : తాజాగా ఏటీఎం సిరీస్ లో కనిపించి అందర్నీ తన నటనతో మెప్పించిన వీజే సన్నీ ఈ సినిమాలో కూడా మంచి నటనతో అన్ని వర్గాల పేక్షకులను ఆకట్టుకున్నాడు. తన లుక్స్, డైలాగ్ డెలివరీ భేష్..అన్ని ఫ్రేమ్ లోనూ అతడి నటన మెచ్చుకోకుండా ఉండలేరు. ఆయా సన్నివేశాల్లో అతడి హావభావాలు బాగున్నాయి. అలాగే తన కామెడీ టైమింగ్ సహా కొన్ని మాస్ షేడ్స్ సినిమాలో ఎంతో బాగున్నాయి.ఆ సన్నివేశాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తన స్నేహితుడిగా నటించిన సప్తగిరి తనదైన మార్క్ కామెడీతో పలువురిని విశేషంగా ఆకట్టునే ప్రయత్నం చేసాడు. ఇకపోతే.. పెర్ఫామెన్స్ పరంగా కోడోత్ మంచి నటన కనబరిచాడు. అలాగే సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి లు కూడా తమవంతు భాద్యతగా ప్రేక్షకులను తమ నతనతో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే సినిమాలో సంగీతం అలరిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా కొత్త కథేమీ కనిపించదు. అయితే.. దర్శకుడు సినిమాను ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా తెరకెక్కించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ఆ నవ్వు తెప్పించిన కామెడీ సన్నివేశాలు సినిమా క్యాప్షన్ కి సంబంధం లేకుండా అనిపిస్తాయి. ఇంకా మెయిన్ గా సన్నీ-సప్తగిరి లనే ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చినట్టే సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా ఆయా పాత్రలకున్న పరిధి మేరకు హాయిగా నవ్వులు పూహించాయి. కథానాయిక కూడా తన నటనతో ఓకే అనిపించింది. అలాగే విలన్ కి హీరోలకి మధ్య మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ కూడా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే మరింతగా బావుండేది.

టెక్నీకల్ విషయాలకొస్తే.. సాంకేతికంగా చూస్తే.. ఈ చిత్రం అన్ని విధాలుగా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చిత్ర స్థాయి తగ్గట్టే ఉన్నాయి. భీమ్స్ మ్యూజిక్ వాహ్.. అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే.. బాప్ రే అనిపించేలా ఉంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇక దర్శకుడు డైమండ్ రత్నబాబు ఆకట్టుకునే సినిమాను ప్రేక్షకులను అందిచడంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. సినిమాలో అక్కడక్కడా తప్ప ఎక్కడో ఓ చోటా కామెడీ సీన్స్ మిన్నగా పూర్తి స్థాయిలో వినోదాన్ని అందిచేలా ఎంతో కృషి చేసినట్టు కనియించింది. చివరగా చెప్పొచ్చేదేమిటంటే.. కామెడీ అంటూ వచ్చిన ఈ “అన్ స్టాప్పబుల్” హాయిగా థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి అన్ స్టాప్పబుల్ గా హాస్యాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.