మొదటి స్థానం కోసం పోరాడి చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు బిందు..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో 10 వారాలు పూర్తి చేసుకుని ఫినాలేకి చేరువలో ఉంది. ఈ వారంలో ప్రతి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ నటరాజ్ మాస్టర్ కి సహాయం చేయక పోవడం వల్ల ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈరోజు ఎపిసోడ్లో బాబా భాస్కర్ మాస్టర్ అరియాన కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం అయ్యాడు. ఎలాగో శనివారం వరకే ఉండేది నువ్వు అంటూ బాబా భాస్కర్ మాస్టర్ వేసిన జోకులకి అరియాన ఫీల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది.

ఈరోజు ఎపిసోడ్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్ లకు ఎనిమిది టైం కార్డులు ఇచ్చారు. ఆ కార్డులలో వివిధ నిమిషాలు ఉంటాయి. ఇంటి సభ్యులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఎక్కువ నిమిషాల్లో ఉన్న కార్డు ధరించాలి. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లు అందరిలో శివ పర్ఫామెన్స్ బెస్ట్ అని ఇంటి సభ్యులందరూ చెప్పగా..
కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్లకంటే కానీ వాళ్లే ఎక్కువ చేశారు.. ఆ లెక్క ప్రకారం శివకి బదులు ఆ 15 మినిట్స్ కార్డ్ తనకే రావాలని బిందు వాదించింది. అంతే కాకుండ శివ వల్ల ఇప్పటివరకు తనకి ఎటువంటి హెల్ప్ అందలేదని చెప్పిందీ.

బాబా భాస్కర్ మాష్టర్ కూడ శివ పేరు చెప్పటంతో బిందు అందుకు విరుద్ధంగా వాదించింది. ఇంటి సభ్యులందరూ కలసి ఏకాభిప్రాయంతో 15 నిమిషాల కార్డుని శివకి ఇచ్చారు. ఆ తర్వాత పది నిమిషాల కార్డు ని నట్రాజ్ మాస్టర్ తీసుకోగా.. అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలని ఇంటి సభ్యులు మాట్లాడుతుంటే బిందు మాత్రం నేను ఈ ఓటింగ్లో పాల్గొనను.. అది ఏకాభిప్రాయం కాదు భిన్నాభిప్రాయం.. అని చెప్పింది. దీంతో 9 నిమిషాల కార్డుని అరియానా తీసుకోగా,7 నిమిషాల కార్డ్ మిత్రా, 5 నిమిషాల కార్డ్ అనిల్ తీసుకున్నారు. చివరికి 1.30 నిమిషాల కార్డ్ బిందుకి దక్కింది. ఇలా మొదటి స్థానం కోసం పోరాడిన బిందుమాధవి చివరికి 1.30 నిమిషాల కార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.