లాక్ డౌన్ తరవాత తొలిసారిగా బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, వీటిని నిర్వహించి దేశంలో సాధారణ పరిస్థితులు తీసుకోని రావాలని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇలాంటి సమయంలో బీహార్ లో రెండు భారీ బాంబులు కలకలం సృష్టించాయి. ఔరంగాబాద్ లో గల దిబ్రా ప్రాంతంలో రెండు భారీ ఐఈడీ బాంబులను సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. దీంతో ఓటువేయడానికి వచ్చిన ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఎంతో భద్రతా నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈ సమయంలో బాంబులు ఆ ప్రాంతానికి ఎలా వచ్చాయి, ఎవరు వాటిని తీసుకొచ్చారు అనే దానిలోని పోలీసులు దృష్టి సారించారు, మిగతా ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు నిఘా ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇక పోలింగ్ విషయానికి వస్తే తొలిదశలో 71 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో దాదాపు 2 . 14 కోట్ల ఓటర్లు ఉన్నారు , అయితే అనుకున్న స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావటం లేదు, తోలి గంటలో కేవలం 5 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఉదయం 9 గంటలు ఓటింగ్ శాతం 6.03 మాత్రమే ఉంది.
ఊహించని విధంగా పోలింగ్ నత్త నడక గా సాగటంతో ప్రధాని మోడీ మాట్లాడుతూ బీహార్ ప్రజలందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటింగ్ శాతం బాగా తగ్గుతుందని.. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. మరోపక్క రాహుల్ గాంధీ సైతం ఓటు హక్కును వినియోగించుకోవాలని, న్యాయం,ఉపాధి భవిష్యత్తు కోసం మహా బంధన్ కు ఓటు వేయాలని కోరాడు, ఈ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి ఎన్నికల బరిలో దిగటంతో , ఆర్జేడీ, కాంగ్రెస్ మరికొన్ని చిన్న పార్టీలు కలిసి మహా బంధన్ (మహా కూటమి) గా బరిలో నిలిచారు కోవిడ్19 జాగ్రత్తలు తీసుకుంటూ బీహార్ ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. శానిటైజర్లు మాస్కులు హ్యాండ్ వాషులకు ఓటర్లకు అందుబాటులో ఉంచారు.