Bigg Boss Telugu 9: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ సీజన్ తెలుగు 9 ఇటీవల గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం రోజులు ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. 9 మంది సెలబ్రిటీల కోటాలో, ఆరుగురు కామనర్స్ క్యాటగిరీలో బిగ్ బాస్ 9 హౌస్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగు పెట్టగా, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్ కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కామనర్స్ మెయిన్ హౌస్‌లో ఉంటుండగా, సెలబ్రిటీలు మాత్రం ఔట్ హౌస్ లో ఉన్నారు. మొత్తానికి ఓనర్స్ – వెర్సస్ టెనెల్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్.
అయితే బిగ్ బాస్ మొదలు కాకముందు హౌస్ లోకి వెళ్ళబోయేది వీరే అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. వారిలో దివ్వెల మాధురి పేరు కూడా ఒకటి. ఈమె పేరు వినిపించింది కానీ ఈమె మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టలేదు. ఇకపోతే ఇదే వ్యవహారం గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడింది దివ్వెల మాధురి. బిగ్ బాస్ 9 ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను. అలాగే ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది మాధురి. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Bigg Boss Telugu 9: నేను బిగ్ బాస్ కి వెళ్లకపోవడానికి కారణం అదే.. దివ్వెల మాధురి కామెంట్స్ వైరల్!
