బిగ్‌బాస్ తెలుగు 5 డిజాస్టర్.. నో డౌట్.!

బిగ్‌బాస్ రియాల్టీ షోకున్న క్రేజే వేరు. ఈ షో స్టార్ట్ అవుతుందంటే చాలు.. ఆడియన్స్‌లో తెలియకుండానే అదో రకమైన క్యూరియాసిటీ అలుముకుంటుంది. కానీ, సీజన్ 5 షో మొదట్నుంచీ డల్‌గానే నడుస్తోంది. ‘డల్’ కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ జిడ్డు షో అని తేల్చేశారు బిగ్ బాస్ వీక్షకులు.

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్లు జరిగాయి. అక్కడికేదో ఈ సీజన్ బిగ్ బాస్ లేడీస్ హ్యాటర్‌లా వరుసపెట్టి ఆడ లేడీస్ అందర్నీ బయటికి గెంటేశాడు. సర్లే ఏదో అడ్జస్ట్ అవుదామా అనుకుంటే, ఆట ఆడేవాళ్లనీ, విషయమున్నమగాళ్లను సైతం బయటికి గెంటేస్తున్నాడు.

యాంకర్ రవి, సన్నీ లాంటి వాళ్లున్నప్పటికీ, వాళ్లపై ఇన్‌ఫ్లూయెన్స్ వంటి ముద్రలు వేసి, పక్కన పెట్టేశాడు. దాంతో వాళ్లేం చేయడానికి లేకుండా పోయింది. షన్నూలాంటి టాలెంట్ ఉన్నవాళ్లు చేతులు ముడుచుకుని కూర్చోవడమే కాక, జిడ్డు ఆటిట్యూడ్‌తో విసుగు పుట్టిస్తున్నారు.. ఇలా ఓవరాల్‌గా చూస్తే, బిగ్ బాస్ సీజన్ 5 అట్టర్ ఫ్లాఫ్ షో అని తేల్చేయడమే కాదు, ఇకపై ఎంత చేసినా.. ఈ సీజన్ క్లిక్ అయ్యే ఛాన్సు లేదని పెదవి విరిచేస్తున్నారు నెటిజన్లు.