Bigg Boss: బుల్లితెర పై ప్రసారమయ్యే అతి పెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే కొంతమంది మాత్రం బిగ్ బాస్ వెళ్లక ముందు వరకు కూడా చాలా వినయంగా ఉంటారు.
ఒకసారి బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి వచ్చిన తర్వాత వారిలో ఉన్నటువంటి యాటిట్యూడ్ మొత్తం బయటపడుతుంది. ముఖ్యంగా రైతు బిడ్డ అంటూ ఎంతో అమాయకంగా కనిపిస్తూ అందరిని తనకు హెల్ప్ చేయాలని కోరిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మాత్రం ఒక సెలబ్రిటీ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేయడంతో ఈయనపై చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. ఇలాంటి క్యాటగిరీకి చెందిన వారే బిగ్ బాస్ సోహైల్ అని కూడా చెప్పాలి.
బిగ్ బాస్ సోహెల్ ఈ కార్యక్రమం తర్వాత పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు వరుస సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు కానీ ఈయన నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో ఇటీవల తన గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.బిగ్ బాస్ తర్వాత తనకు చాలా మైనస్ గా మారిపోయిందని. ఆ సమయంలో తనకు విపరీతమైన బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెంట్ ,నోటికి ఎలాంటి మాట వస్తే అలాంటివి మాట్లాడాను. అయితే నేను అలా మాట్లాడటానికి నా పక్కన ఉన్న వారే కారణం అని కూడా తెలిపారు.
పక్కవారి ప్రభావంతోనే తాను అలా మాట్లాడానని కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నానని తన తప్పు ఏంటో తెలుసుకొని తన పని తాను చేసుకుంటున్నానని తెలిపారు. దేనికైనా సమయం రావాలని ఆ సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతుందని, అప్పుడే వారి పని వారు సక్రమంగా చేసుకుంటూ పోతారు అంటూ సోహైల్ బిగ్ బాస్ కార్యక్రమం వల్ల తనలో పెరిగిన యాటిట్యూడ్ గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.