Kaushal: తాను బిగ్‌బాస్‌లో ఆడిన ఆటను చూసి, చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యారని నటుడు కౌషల్ తెలిపారు. అలా ఒకావిడ ఆమె సూసైడ్ చేసుకుందామని అనుకుందని, అపుడే తన గేమ్ చూసి, ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి, జాబ్ చేస్తూ మా బాబును చదివిస్తున్నానని, ఆవిడ తనకు పర్సనల్‌గా కాల్ చేసి ఏడ్చిన క్షణాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆమెనే కాదు ఇలా చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు. కేరళలో ఒకమ్మాయి కూడా వాళ్లింట్లో చదివించడం లేదని, తనను చూసి ఇన్‌స్పైర్ అయ్యి బయటికొచ్చి పార్ట్‌టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటోందని కౌషల్ చెప్పారు. అలా తన గేమ్ చూసి కొందరైనా ఇన్‌స్పైర్ అయ్యారంటే అది తనకు చాలని, అది టైటిల్ కన్నా ఎక్కువ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మామూలుగా బిగ్‌బాస్ షోకి వెళ్లేదే గెలవడానికి అని, అంతే గానీ అక్కడి వెళ్లాక ఇంకొకరు సపోర్టుగా నిలుస్తారని అనుకోవడం వేస్ట్ అని ఆయన తెలిపారు. అలాగే తాను గెలవడానికే వెళ్లానని, అందుకే తన గేమ్ తాను ఆడానని ఆయన చెప్పారు. అలాగే ప్రతీ ఒక్కరూ అనుకుంటారని, తానైతే మాత్రం ఎవరికీ సపోర్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో గెలవలేక, షో అయిపోయాక అంటే బయటకు వచ్చిన తర్వాత తనను ఓడించాలని చూసిన వాళ్లు కూడా ఉన్నారని కౌషల్ తెలిపారు. వేరే ఛానెల్ వాళ్లకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, అలా ఊరుకోకుండా తననే టార్గెట్ చేసి అలా చేశారంటే అది కూడా ఆటలో ఓ భాగమేనని ఆయన చెప్పారు.
ఇక అందరికీ ఎప్పటినుంచో ఉన్న డౌట్ బిగ్‌బాస్ అంతా స్ర్కిప్టెడా అని అడిగిన ప్రశ్నకు కౌషల్ కాదు అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా తాను ఇప్పటివరకూ వచ్చి బిగ్‌బాస్ సీజన్లన్నీ ఫాలో అవుతూ వచ్చానని, తాను ఎప్పుడైనా 6 వీక్స్ ఉందనగానే తాను విన్నరో ఎవరో చెప్పేశానని ఆయన అన్నారు. అలాగే ఈ మధ్య జరిగిన సీజన్ 5 విన్నర్ సన్నీ పేరును కూడా తాను 6 వారాలకు ముందే గ్రహించానని, అదే చెప్పానని ఆయన తెలిపారు. డైరెక్ట్‌గా పేరు చెప్పకపోయినా వీరిద్దరి మధ్య పోటీ ఉందని మాత్రం చెప్పినట్టు కౌషల్ వివరణ ఇచ్చారు.