బిగ్‌బాస్ ఎలిమినేషన్: ఈ సారి ఎలిమినేట్ అయ్యే ‘లేడీ’ ఎవరో.?

19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ రియాల్టీ షో 50 రోజులు పూర్తి చేసుకుంది. లేటెస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియ ఆంటీని బయటికి పంపించేశారు. బాగానే ఉంది. అసలీసారి బిగ్‌బాస్ కేవలం మగవాళ్లకు మాత్రమేనా.? అనే అనుమానాలొస్తున్నాయి వీక్షకుల్లో.

గత సీజన్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్‌లో ఎలిమినేషన్లు కేవలం లేడీస్‌తోనే జరుగుతున్నాయి. ఇంతవరకూ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్లలో నటరాజ్ మాస్టర్ తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఫీమేల్ కంటెస్టెంట్లే. హౌస్‌కి కలరింగ్ మొత్తం పోతోందంటూ బిగ్‌బాస్ వీక్షకులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ వారం నామినేషన్లలో భాగంగా రవి, లోబో, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్‌లతో పాటు, లేడీ కంటెస్టెంట్ సిరి కూడా ఉంది. మరి బిగ్‌బాస్ తీరు చూస్తుంటే ఈ సారి సిరిని కూడా బయటికి తోసేస్తారా.? అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు నెటిజన్లు సైతం. 50 రోజులు గడుస్తున్నా, బిగ్‌బాస్ ఆశించిన రైజింగ్ అందుకోలేదు.

అందులోనూ ఈ ‘ఫీమేల్ ఎలిమినేషన్లు..’ అరే ఏంట్రా ఇది. ఆల్టర్‌నేట్ ఎలిమినేషన్లు పెట్టుకుంటే బావుంటుంది కదరా.. అని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.