Parag – Shefali: వామ్మో.. ఎయిర్ పోర్టులో భర్తతో ఆ పని చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజెన్స్!

Parag – Shefali: సాధారణంగా సెలబ్రిటీలు వారి వారి పనుల నిమిత్తం లేదా సినిమా షూటింగుల కోసం ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో సెలబ్రిటీలు ఉన్న సమయంలో ఎన్నో కెమెరాలు వారిని క్లిక్ మనిపిస్తాయి. వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా బిగ్ బాస్ 13 త్వరగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరాగ్ షెపాలీ ఇటీవల న్యూయార్క్ పయనమైంది ఈ క్రమంలోనే ఆమె భర్త ‘బ్రహ్మ రక్షక్’ ఫేం పరాగ్ త్యాగి ఈ భామకి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.

ఇక ఎయిర్ పోర్టులో వీరిద్దరూ కనిపించేసరికి ఎన్నో కెమెరాలు వీరిపై ఫోకస్ చేశాయి. ఈ సందర్భంగా పరాగ్ త్యాగి తన భార్య పరాగ్ షెపాలీకి అందరూ చూస్తుండగానే గట్టిగా లిప్ లాక్ చేశారు. ఇలా ఒకేసారి కాకుండా ఏకంగా మూడుసార్లు లిప్ లాక్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు పెద్ద ఎత్తున వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో రహస్యంగా నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని ఇలా బహిరంగంగా చేయడం ఏంటి అంటూ చాలా మంది నెటిజన్లు వీరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మీ ఇంట్లో ప్రత్యేక గదులు లేవా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇది పబ్లిక్ ప్లేస్ కొంచెం పద్ధతిగా ప్రవర్తించండి మీరు చేస్తున్న పని చాలా చల్లగా ఉంది అంటే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.