Big Boss 5 Telugu: బిగ్ బాస్ కార్యక్రమంలో సిరి షణ్ముఖ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ ముందు నుంచి మంచి స్నేహితులు అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత స్నేహం ముసుగులో వీరు చేస్తున్నటువంటి రొమాన్స్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్, సిరి పై పెత్తనం చెలాయిస్తూ తనని తన కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తున్నాడు. హౌస్ లో ఇతర కంటెస్టెంట్ లతో సిరి కాస్త చనువుగా మాట్లాడిన ఓర్చుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే సన్నీ, మానస్ తనని కామ చూపులతో చూస్తున్నారని వారికి దూరంగా ఉండాలంటూ తనకు హెచ్చరిస్తున్నాడు.
ఇక వారితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా వారిని అన్నయ్య అని పిలవమని సిరితో వారిని అన్నయ్య అని పిలిచేలా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సిరి తాను ఆడించినట్లు ఆడుతూ ఉండడంతో ఎంతోమంది నెటిజన్లు వీరి వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు.ఈ క్రమంలోనే సినీ నటి మాధవిలత వీరి గురించి ఇదివరకే ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన తాజాగా మరొకసారి వ్యవహారశైలిపై స్పందించారు. ఇక సిరి నిత్యం ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ షణ్ముఖ్ జస్వంత్ ను కౌగలించుకుని ముద్దులు పెడుతూ రొమాన్స్ కి ఫ్రెండ్షిప్ అనే పేరును పెట్టారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా షణ్ముఖ్ జస్వంత్ ఏకంగా సిరి తల్లిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సిరి అవన్నీ పట్టించుకోకుండా షణ్ముఖ్ మాయలో పడింది. ఈ క్రమంలోనే మాధవీలత స్పందిస్తూ అసలు సిరిది సిగ్గులేని జన్మ.. తన తల్లిని అవమానించిన ఆ వ్యక్తిని పట్టుకుని కన్నా అంటూ అతని పై ప్రేమకురిపిస్తుంది. అదే తను చేసుకోబోయే శ్రీహన్ ను మాత్రం చోటు అని పిలుస్తుంది. కేవలం ఓట్లు నోట్ల కట్ల కోసం ఇంత దిగజారడం అవసరమా అంటూ వీరి వ్యవహార శైలిపై మాధవి లత మరోసారి మండిపడ్డారు.