Home News బిగ్ బాస్4: అరియానాకు బుద్దిలేదు..విరుచుకుపడ్డ మోనాల్

బిగ్ బాస్4: అరియానాకు బుద్దిలేదు..విరుచుకుపడ్డ మోనాల్

పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ ఎంత వింతగా జరిగిందో అందరికీ తెలిసిందే. అది మొత్తం అదృష్టంపైనే ఆధారపడింది. టోపీలను పెట్టుకోమని బిగ్ బాస్ ఆదేశించడం… ఆ టోపీలు అందరూ ధరించడం.. అందులో కొందరి రెడ్ కలర్, ఇంకొందరికి గ్రీన్ కలర్ రావడం తెలిసిందే. అలా మోనాల, సోహెల్‌లకు గ్రీన్ కలర్ వచ్చి సేవ్ అయ్యారు. మిగతా వారంతా రెడ్ కలర్‌ వచ్చి నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన సభ్యులకు స్వాప్ అయ్యే చాన్స్ ఇచ్చాడు. సేవ్ అయిన సభ్యులతో వాదించి ఒప్పించి వారితో స్వాప్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు.

Bigg Boss 4 Telugu Week 12 Monal About Ariyana
Bigg Boss 4 Telugu week 12 Monal about Ariyana

ఆ ప్రక్రియలో భాగంగా అరియానా మోనాల్‌తో వాదనకు దిగింది. మోనాల్ వీక్.. తనకంటే నేను స్ట్రాంగ్.. నేనే టాస్కుల్లో బాగా ఆడతాను.. ఆమె కంటే నాకే అర్హత ఎక్కువగా ఉందంటూ చాలానే మాటలు అనేసింది. అలా మోనాల్ అరియానా మాటలు వింటూనే ఉంది. అరియానా మాటలన్నీ అయిపోయాక.. ఒక్క మాటతో నోర్మూయించింది. మీరు నాకంటే స్ట్రాంగ్ కదా నామినేట్ అవ్వడానికి ఎందుకు భయం.. అని ప్రశ్నించింది. నాకేం భయం లేదు. ఇదొక ప్రక్రియ కాబట్టి అడుగుతున్నానని అరియానా చెప్పింది.

అయితే ఇలాగే సోహెల్‌ను కూడా ఇంతకుముంద అడిగింది. కానీ మోనాల్‌ను అడినప్పుడు సోహెల్‌తో మాట్లాడినప్పుడు ఆమె గొంతులో ఎంతో మార్పుంది. ఇక ఈ విషయాలన్నీ మోనాల్ హారికతో ముచ్చటించింది. ప్రతీసారి ఎవరో ఒకరి సపోర్ట్ కావాలని అంటుంది.. అసలు ఎందుకు సపోర్ట్ సింగిల్‌గా ఆడదా.. ఆమె కెప్టెన్సీలో బెస్ట్ పర్ఫామెన్స్ ఎవరని అంటే ఆమె పేరే చెప్పుకుంది..అరియానాకు బుద్దిలేదు అంటూ మోనాల్ విరుచుకుపడింది. బుద్దిలేదు అనే పదం తెలుగులో అనేసరికి హారిక ఆశ్చర్యపోయింది. ఆ పదం ఎవరి దగ్గర నేర్చుకున్నావ్ అని సెటైర్ వేయడంతో మోనాల్ నవ్వేసింది.

- Advertisement -

Related Posts

వెంకటేష్ నారప్ప రిలీజ్ ఎప్పుడు ..?

వెంకటేష్ నారప్ప సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్స్ అంతగా రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకటేష్ మరోసారి తమిళ సూపర్ హిట్...

రవితేజ కాదు ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ విజయ్ సేతుపతి చేతిలో ఉందా ..?

రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ దక్కలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత...

అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత ..?

అఖిల్ 4 గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సమంత గెస్ట్ రోల్...

కొండను ఢీకొడతానంటున్న బండి.. కళ్ళు తిరిగి పడిపోరు కదా !

భారతీయ జనతా పార్టీలు దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అంతగా వెలిగిపోతున్న రాష్ట్రం తెలంగాణ.  ఉద్యమం నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన కేసీఆర్ ను కిందకు లాగడం అంత ఈజీగా అయ్యే పని కాదని, ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని  అంతా అనుకున్నారు.  కానీ భారతీయ...

Latest News