Big update on Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని అదరగొడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా తాను చేసిన సినిమాలు రాధే శ్యామ్, సాహో లు భారీ ప్లాప్ లు అయ్యాయి. దీనితో రాబోయే సినిమాలతో అయిన హిట్ అందుకోవాలని డార్లింగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా తాను చేస్తున్న బిగ్గెస్ట్ మాస్ ఏక్షన్ థ్రిల్లర్ “సలార్” పై రీసెంట్ గా కొన్ని బిగ్ అప్డేట్లే బయటకి వచ్చాయి.
ఇక ఇదిలా ఉండగా ఈరోజు లేటెస్ట్ గా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా వేరిఫై అయ్యినట్టుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. అయితే గత కొన్ని రోజులు కితమే అంటే గత నెలలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత సలార్ టీజర్ పై ఓ రేంజ్ టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ దీనిపై లేటెస్ట్ బజ్ బయటకి వచ్చింది.
దీనితో అయితే ఇప్పుడు సలార్ ట్విట్టర్ ఖాతా ఖరారు కావడం ఈ నెలలో టీజర్ పై అప్డేట్ కోసం కూడా కావచ్చని ఆ బిగ్ అప్డేట్ త్వరలోనే రావొచ్చని ఇండస్ట్రీలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ బిగ్ అప్డేట్ కోసమే ఇదంతా అయితే మరికొన్ని రోజుల్లో ఈ అప్డేట్ రావచ్చు. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళ్ నిర్మాణ సంస్థ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
— Salaar (@SalaarTheSaga) May 17, 2022