Shraddha Kapoor : బాబోయ్.! శ్రద్ధా కపూర్ ఇంతలా భయపెడుతోందెందుకు.?

Shraddha Kapoor :  టాలీవుడ్ యంగ్ హీరో సినిమా కోసం బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పేరు తాజాగా పరిశీలనలోకి వచ్చిందట. శ్రద్ధా కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకుంటే, తన సినిమాకి ప్యాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఆ యంగ్ హీరో భావిస్తున్నాడట. దాంతో ఆమె పేరును నిర్మాత వద్ద ప్రపోజల్‌కి పెట్టాడట.

ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాని రూపొందిస్తున్నాడనీ సమాచారం. అయితే, ‘సాహో’ రిజల్ట్‌తో శ్రద్ధా కపూర్‌ని తీసుకునే ప్రయత్నం మానుకోమని ఆ నిర్మాతకు సన్నిహితులు సూచిస్తున్నారట. కానీ, హీరో మాత్రం శ్రద్ధా కపూర్ విషయంలో గట్టిగా ప్రయత్నిస్తున్నాడనీ సమాచారం.

గతంలో టాలీవుడ్ రిజక్ట్ చేసిన కత్రినా కైఫ్, దిశా పటానీ, కృతి సనన్ తదితర ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యారు. స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్లని టాలీవుడ్‌కి తీసుకురావాలంటే అధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేసి, బతిమలాడి మరీ తెలుగింటికి తీసుకురావల్సి వస్తోంది.

ఏదో ఒక్క సినిమా ఫెయిలైందని పాపం శ్రద్ధా కపూర్‌ని ఐరెన్ లెగ్ అనేయడం ఎంతవరకూ సబబు.? మరోవైపు ఇప్పుడిప్పుడే నార్త్ భామలు సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదివరకైతే, అస్సలు ఆలోచనే చేసేవారు కాదు. అలాంటిది, స్పెషల్ ఇంట్రెస్ట్‌తో సౌత్  సినిమాల్లో నటించేందుకు ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ యంగ్ హీరో ప్యాన్ ఇండియా కల శ్రద్ధా కపూర్ కారణంగా నిజమవుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!