బిగ్ న్యూస్ : డ్రగ్స్ కేసులో స్టార్ హీరో కొడుక్కి క్లీన్ చిట్ అట.!

Aryan Khan Drugs Case

విరివిగా అనేక సార్లు న్యూస్ ఛానెల్స్ లో పలువురు స్టార్ హీరోలు హీరోయిన్ లు డ్రగ్స్ తీసుకున్నారని రేవ్ పార్టీ లు అని అనేక వార్తలు మనం వినే ఉంటాము. అంతెందుకు రీసెంట్ గానే మన టాలీవుడ్ కి చెందిన ఓ పార్టీ సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున కలకలం రేపాయి. అయితే మన దగ్గర కన్నా బాలీవుడ్ లో ఇలాంటి వార్తలు బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఇలా డ్రగ్స్ ఇతర సెన్సేషనల్ విషయాల్లో బాలీవుడ్ హాట్ హీరోయిన్ లు, హీరోల పిల్లలు చిక్కిన ఘటనలు ఉన్నాయి.

అయితే ఈ ఘటనలో గత కొన్ని నెలల కితం బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిక్కుకోవడం కలకలం రేపింది. ముంబై బీచ్ దగ్గర సముద్రంలో అనేకమంది తో కలిసి రేవ్ పార్టీ లో ఉండగా పక్కా సమాచారం తో ఎన్ సి బి వారు దాడులు చెయ్యగా ఆర్యన్ ఖాన్ పేరు బయటకి వచ్చింది. దీనితో షారుఖ్ తన కొడుకుని కాపాడేందుకు చాలానే శ్రమించారు. అయితే ఇప్పుడు తాజాగా సంచలన తీర్పు ఈ కేసు విషయంలో బయటకి వచ్చింది.

ఈ కేసు విచారణలో ఆర్యన్ నిర్దోషి అని అతడు ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని ఎన్ సి బి నార్కోటిక్స్ వారు క్లీన్ చిట్ ఇచ్చి విడుదల చేసారట. అలాగే తనపై ఉన్న అన్ని ఛార్జ్ షీట్స్ ని కూడా వారు ఎత్తివేసినట్టుగా తీర్పు అందించారు. మొత్తానికి అయితే ఇలా ఆర్యన్ ఈ కేసు నుంచి బయటకి వచ్చేసాడు. ఇక ప్రస్తుతం అయితే షారుఖ్ ఖాన్ “పఠాన్” అలాగే తమిళ దర్శకుడు అట్లీ తో భారీ పాన్ ఇండియా సినిమా లయన్ ఇంకా ఇండియాస్ టాప్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరాని తో దున్కి అనే సినిమా చేస్తున్నాడు. వీటిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.