Supreme Judge NV Ramana : ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా భారతీయ సినిమా దగ్గర మన తెలుగు సినిమాదే పై చేయి చెప్పినా ఎలాంటి తప్పు లేదు. ఆ రేంజ్ లో మన తెలుగు సినిమాలు స్టాండర్డ్స్ ని పెంచాయి. అయితే మరికొన్ని సినిమాలు తెలుగు సినిమాలు స్టాండర్డ్స్ ని పెంచుతుండగా మరికొన్ని సినిమాలు అయితే అలా లేవు. అలాగే ప్రేక్షకులు కూడా అలా లేరు..
ఇలాంటి అన్నింటిపై మన తెలుగు వారైన అందులోనే దేశ సుప్రీం న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి అయినటువంటి ఎన్ వి రమణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు కేవలం కొంత కాలం మాత్రమే వినోదం ఇచ్చేలా ఉన్నాయని గత చిత్రాల్లా గుర్తుండిపోయే స్థాయి సినిమాలు రావడం లేదని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు బి ఏ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా తెలిపారు.
ఇపుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మన తెలుగు సినిమాలను తెలుగు సబ్ టైటిల్స్ డైలాగ్స్ అర్ధం చేసుకొని పరిస్థితికి మారింది అని అలంటి దయనీయ పరిస్థితిలోకి తెలుగు సినిమాని తీసుకురావద్దని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన సూచించారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.