Theaters Closed In AP : ఏపీ లో గత కొన్ని రోజులు నుంచి సినిమా థియేటర్లు మరియు టికెట్ ధరలకు సంబంధించి అనేక అగచాట్లు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి పరిష్కారం అయితే ఎప్పుడు దొరుకుతుందో కానీ ఆంద్రప్రదేశ్ లో థియేటర్ లు మూత పడడం మాత్రం ఆగట్లేదు. గత కొన్ని రోజులు నుంచి మొదలైన ఈ థియేటర్స్ మూత ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతుంది అట.
ఇక ఇప్పుడు ఈ సంఖ్య ఏకంగా 175 కి చేరిపోయింది అట. దీనితో ఏపీలో పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఇదే కానీ కొనసాగితే ఏపీలో రాబోవు భారీ సినిమాలు కి భారీ దెబ్బ తప్పదని చెప్పాలి. ఇప్పటికే యంగ్ హీరోలు అంతా కూడా తమ గళం విప్పడం స్టార్ట్ చేశారు.
పెద్దలు కూడా కీలక చర్చలు జరుపుతారని టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే సానుకూల స్పందన వస్తుంది అని వినిపిస్తోంది మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.