జగన్ – కేసీఆర్ ల కళ్ళముందే ఢీ కొడుతున్న టాప్ మినిస్టర్ లు !

KCR-Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యనున్న స్నేహాం కాస్త శత్రుత్వంగా మారనుంది. ఇప్పటికే ఒకరి ప్రభుత్వంపై మరొకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాల నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మిత్రులుగా ఉన్న వైసీపీ- తెరాస నేతలు ముఖ్యమంత్రుల ఎదురుగానే తిట్టుకుంటున్నారు.

Ys-jagan-kcr
Ys-jagan-kcr

గొడవలకు బాట వేసిన హరీష్ రావు

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లకు బిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచడానికి ప్రయత్నం చేస్తుందని, అందుకే ఈనిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించరని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రూ.2500 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కానీ రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆ డబ్బు తెచ్చుకుని ఇప్పుడు మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓ వైపు రైతును నిండా ముంచుతూనే.. మరోవైపు విద్యుత్‌ మీటర్ల పేరుతో వారి ఉసురు తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనికి మంత్రి బాలినేని కౌంటర్ ఇచ్చారు.

బాలినేని కౌంటర్

ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి బాలినేని తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. తెలంగాణ నేతలకు తెలంగాణపై కంటే కూడా ఏపీపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, తెరాస నేతలు ఏపీన్ కాకుండా తెలంగాణ యొక్క సమస్యల పట్ల శ్రద్ద చూపిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల పరిస్థితులు ఒకేలా ఉండవని, వాళ్లకు ఉన్న పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్ల ఫండ్ ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామే తప్ప అవి తమ జేబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండటం మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధికోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావించామన్నారు. రైతులకు మరో 30 సంవత్సరాల వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తుందని వెల్లడించారు.