Home News బిగ్ బ్రేకింగ్ : ప్రకాష్ రాజ్ ఇంటి ముందు పవన్ కల్యాణ్ ఫాన్స్ ధర్నా ?

బిగ్ బ్రేకింగ్ : ప్రకాష్ రాజ్ ఇంటి ముందు పవన్ కల్యాణ్ ఫాన్స్ ధర్నా ?

 ప్రముఖ విలక్షణ నటులు ప్రకాష్ రాజ్ నిన్న ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు , ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోని పవన్ ఫాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

Prakash Raj Vs Pawan Kalyan

 “పవన్ కు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. పవన్ విషయంలో చాలా నిరాశచెందాను. ఆయన ఓ లీడర్, ఆయనకు ఓ పార్టీ ఉంది. మరో నాయకుడి భుజం ఎందుకు ఎక్కారు? 2014లో బీజేపీని సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీని ద్రోహి అన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే ఆయనకు మహా నాయకులుగా కనిపిస్తున్నారు. 3-4 సార్లు మాట మార్చారు. అంటే పవన్ ఊసరవెల్లి అయి ఉండాలి.” జాతి హితం కోసం బీజేపీకి మద్దతిస్తున్నారని పవన్ చెబితే జనాలు నమ్మరంటున్నారు ప్రకాష్ రాజ్. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల మాటలు జాతి హితానికి తగ్గట్టు ఉన్నాయా అని ప్రశ్నించారు.

 “తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. గత ఎన్నికల్లో అట్నుంచి ఇటు వచ్చిన వాళ్లకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన చాలా పనుల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలే బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. వీళ్ల వెనక వెళ్లిన మన వాళ్లకు కూడా ఓసారి గుణపాఠం నేర్పాలి.” అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడటం జరిగింది. దీనితో జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేస్తూ, దారుణంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు, ఇదే సమయంలో కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏకంగా ప్రకాష్ రాజ్ ఇంటి ముందు ధర్నా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

 మరోపక్క పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ మీద విరుసుకుపడుతూ “ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్‌ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు” అంటూ సోషల్ మీడియా లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు..

- Advertisement -

Related Posts

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

Latest News