Y.S.Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న వైయస్ జగన్?

Y.S.Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి జరగబోతున్నాయి ఈ క్రమంలోని ఈ అసెంబ్లీ సమావేశాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. 2025 – 26 సంవత్సరానికి బడ్జెట్ గవర్నర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని సుమారు 15 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

ఇక జగన్ మోహన్ రెడ్డికి గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఈయనకు ప్రతిపక్ష నేతగా హోదా కూడా లేకుండా పోయింది అయితే ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది తప్ప ప్రతిపక్షనేతగా అక్కడికి వెళ్లి ప్రశ్నించే హక్కు మాత్రం ఉండదు అందుకే జగన్ తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే ప్రజల సమస్యలను అక్కడ మాట్లాడటానికి వెసులుబాటు ఉంటుందని అందుకే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక ఈయనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వక పోయినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన గవర్నర్ ప్రసంగించే వరకు మాత్రమే ఈ సమావేశాలలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమావేశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇప్పటివరకు అధికారకంగా ఎక్కడ వెల్లడించలేదు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి అసెంబ్లీకి రావాలా.. వద్దా..? అనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.