విశాఖలో తృటిలో తప్పిన పెను ప్రమాదం… ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు?

కొన్ని సందర్భాలలో అనుకోకుండా చోటుచేసుకునే అగ్ని ప్రమాదాల వల్ల తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం కూడా జరుగుతుంది. తాజాగా విశాఖలో ఒక ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన బస్సు డ్రైవర్ నేను నిలిపివేసి ప్రయాణికులు అందరినీ కిందికి దింపాడు. ఈ క్రమంలో క్షణాలలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… ఇటీవల ఆర్టీసీ బస్సు ఎక్కువ మంటలు అంటుకున్న ఘటనలో విశాఖలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 400 N నంబర్ గల ఆర్టీసీ బస్సు పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కాన్వెంట్ కూడలి పై వంతెన వద్దకు రాగానే బస్సు వెనుక టైరు నుంచి పొగలతో పాటు మంటలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన కండక్టర్ వెంటనే డ్రైవర్ కి చెప్పి బస్సును నిలిపివేశాడు. ముందు జాగ్రత్తగా ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులను కిందికి దించారు.

స్థానికులు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ బృందం గంట సమయం పాటు శ్రమించి బస్సులో వ్యాపించిన మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో అటువైపు వస్తున్న ఒక లారీ గ్యాస్ సిలిండర్ లోడుతో ఉండగా హోంగార్డు గమనించి లారీని దూరంగా ఆపివేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బస్సులో ఇలా మంటలు వ్యాపించడానికి గల కారణాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. డ్రైవర్, కండక్టర్ ముందు జాగ్రత్త వల్ల 50 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు.